telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ‌లో ప్రారంభమైన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష..

*తెలంగాణ‌లో ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభం
*తెలంగాణ‌లో 554 ఎస్సైపోస్టుల‌కు ప్రిమిన‌రీ ప‌రీక్ష‌
*రాష్ర్ట‌వ్యాప్తంగా 538 ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు
*నిమిషం ఆల‌స్య‌మైనా నో ఎంట్రీ..

తెలంగాణ‌లో ఎస్సై ప్రిలిమినరీ  పరీక్ష ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహిస్తున్న ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. దీనికోసం పోలీస్ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 538 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది.

 కాగా.. రాష్ట్రంలో మొత్తం 554 ఎస్సై పోస్టులకు గాను 2,47,217 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 446 మంది పోటీ పడుతున్నారు.

 పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల బ్యాగులు, సెల్ ఫోన్లు, చేతి గడియారాలు, కాలిక్యులేటర్ తదితర వస్తువులు పరీక్ష కేంద్రాలకు అనుమతించరు.

తమ వెంట హాల్ టికెట్, పెన్ మాత్రమే తీసుకురావాలన్నారు. హాల్​టికెట్​పై వివరాలన్నీ సరిచూసుకొని పాస్ పోర్టు సైజ్ ఫోటో అతికించాలని.. లేని పక్షంలో పరీక్షకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అలాగే మెహందీ, టాటూ కూడా వేసుకోవద్దన్నారు.

Related posts