భాగ్యనగరం ప్రజలకు తాగునీటి గోసను తప్పించింది టీఆర్ఎస్ సర్కార్ అని కేటీఆర్ అన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ హైదరాబాద్ నగరంలో కేసీఆర్ వల్లే సాధ్యం అయ్యిందన్న ఆయన కేసీఆర్ వచ్చిన తర్వాత ఆరేళ్ళ నుంచి హైదరాబాద్ లో ఆ లొల్లి లేదని అన్నారు. పెట్టుబడులు వరదలా హైదరాబాద్ కు వస్తున్నాయన్న ఆయన ఉత్తర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ లోకి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి అని ఆరా తీశారని అన్నారు. హైదరాబాద్ లో అశాంతి చెలరేగితే మొత్తం తెలంగాణ దెబ్బ తింటుందని, భాగ్యలక్ష్మి గుడి ఎందుకు ? బిర్లా మందిర్ లేదా ? టాడ్ బండ్ ఆంజనేయ స్వామి గుడి లేదా ? అని ఆయన బండి సంజయ్ ని ప్రశ్నించారు. పాతబస్తీలో గెలుక్కునెందుకే బండి సంజయ్ భాగ్యలక్ష్మి గుడికి వెళ్లారన్న ఆయన 28 నాడు సీఎం కేసీఆర్ సభ ఎల్బీ స్టేడియంలో ఉంటుందని అన్నారు. గత ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీలో సెంచరీ మిస్సయ్యామన్న కేటీఆర్, ఒక్క బాల్ కొడితే సెంచరీ అయ్యేదని, జాంభాగ్‌లో 5 ఓట్లతో ఓడిపోయామని అన్నారు. ఈ సారి తప్పకుండా సెంచరీ కొడతామని అన్నారు. చూడాలి మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది.
previous post
తనను ఓడించేందుకు వంద కోట్లు: పవన్