కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. రోజుకు రెండు ఆంక్షలకు పాగా మంది ఈ వైరస్ బరోడా పడుతుంటే 4 వేలకు పైగా మంది మరణిస్తున్నారు. ఈ కష్ట సమయంలో టాటాస్టీల్ కంపెనీ మరోసారి తన గొప్ప మనస్సు చాటుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కోవిడ్‌తో కన్నుమూసిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ఉద్యోగకాలం ముగిసేవరకు మృతుల జీతాలను మృతిచెందినవారి కుటుంబాలకు అందిస్తామని టాటా స్టీల్ కంపెనీ స్ఫష్టంచేసింది. కేవలం జీతమే కాకుండా ఉద్యోగులకు లభించే అన్ని రకాల ప్రయోజనాలను కూడా వారి కుటుంబాలకు కూడా అందిస్తామని టాటా స్టీల్ కంపెనీ స్ఫష్టం చేసింది. ఉద్యోగుల పిల్లలు చదువుకు సంబంధించి విధ్యాభ్యాస ఖర్చులు కూడా తామే భరిస్తామని టాటా స్టీల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
previous post
next post