telugu navyamedia
క్రీడలు వార్తలు

క్రికెట్‌లో ఈక్వాలిటీ లోపించింది…

టీంఇండియా మహిళల క్రికెట్ జట్టుకు కేటాయించాల్సిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని బీసీసీఐ సుమారు 15 నెలల పాటు తన వద్దే అట్టి పెట్టుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీసీఐ వంటి బోర్డు.. విమెన్ టీమ్‌పై అలా వ్యవహరించి ఉండాల్సింది కాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇంగ్లాండ్ మాజీ విమెన్ క్రికెటర్, కామెంటేటర్ ఇసా గుహ వారితో గొంతు కలిపారు. పురుషులతో సమానంగా ప్రోత్సహించగలిగితే.. మహిళ జట్టు కూడా అద్భుతాలు చేస్తుందని, దానికి అవసరమైన చర్యలను తీసుకోవడంపై ఎవరూ పెద్దగా ఫోకస్ చేయట్లేదని వ్యాఖ్యానించారు. టీమిండియా విమెన్ క్రికెటర్లకు బీసీసీఐ చెల్లించాల్సిన ప్రైజ్‌మనీలో జాప్యం చోటు చేసుకోవడం పట్ల ఆమె స్పందించారు. క్రికెట్‌లో ఈక్వాలిటీ లోపించిందని స్పష్టం చేశారు. పురుషులతో సమానంగా మహిళలను చూడట్లేదని తేల్చి చెప్పారు. మహిళలు ఎందులోనూ తీసిపోరని, పురుషులతో సమానంగా రాణించగలరని అన్నారు. ఆ దిశగా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లను చూడగలిగితే- అద్భుతాలను సాధిస్తారనడంలో సందేహాలు అక్కర్లేదని ఇసా గుహ అభిప్రాయపడ్డారు.

Related posts