telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు పొడగింపు

telangana intermediate board

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్ష ఫీజు గడువును పొడగించింది. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్ష ఫీజు గడువు పొడగిస్తూ ఇంటర్‌ బోర్డు సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ ఆదేశాలు జారీ చేశారు. 29-10-2019 వరకు చివరి తేదీ కాగా దానిని 04-11-2019 తేదీ వరకు పొడగిస్తున్నట్లు వెల్లడించారు.

ఇంటర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ, ప్రైవేట్‌ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. నవంబర్‌ 4వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకోవాలని, నవంబర్‌ 5వ తేదీ లోపు ఇంటర్‌ బోర్డు అకౌంట్‌లో ఆయా కళాశాలల ప్రిన్సిపళ్లు జమ చేయాలని ఆదేశించారు.

Related posts