telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమ్మ చావుబతుకుల్లో… నేను చేసిన పని తెలిస్తే మీరు నన్ను… : షారుఖ్ ఖాన్

Sharukha-Khan

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ షారూఖ్ ను ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. షారుఖ్ చివ‌రిగా “జీరో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం షారూఖ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. షారూఖ్ ఖాన్‌కి దేశ విదేశాల‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. సినిమా హిట్‌, ఫ్లాప్ అనేది సంబంధం లేకుండా షారూఖ్‌ని అభిమానిస్తుంటారు. తాజాగా ప్రఖ్యాత డేవిడ్ లెటర్‌మ్యాన్ షోలో షారుక్ పాల్గొన్నారు. ఈ షోలో తన పర్సనల్ లైఫ్, మ్యారేజ్, సినీ కెరీర్.. ఇలా ఎన్నో విషయాలను పంచుకున్నారు. అయితే తన తల్లిదండ్రుల మరణం గురించి మాత్రం షారుక్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. “నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. 26 ఏళ్లు వచ్చాక అమ్మ కూడా వెళ్లిపోయింది. తల్లిదండ్రులతో కలిసి ఎంజాయ్ చేయాల్సిన వయసులోనే వారిని కోల్పోయాను. ఎంత కుమిలిపోయానో నాకు మాత్రమే తెలుసు. అయితే చావు విషయంలో నేను ఓ సిద్ధాంతాన్ని చాలా నమ్ముతాను. ఎవరికైనా చావు అనేది ఎప్పుడొస్తుందంటే.. వారు సంతృప్తికరమైన జీవించినప్పుడు. మనం జీవితంలో సాధించాల్సినవి ఇంకా ఉన్నప్పుడు మాత్రం చావు రాదని నేను నమ్ముతాను. మా అమ్మ ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నేను చేసిన పని తెలిస్తే మీరు నన్ను తిట్టుకుంటారు. అమ్మ జీవితం సంతృప్తికరంగా ఉంది కాబట్టే ఆమె చావుకు దగ్గరైంది. అలాకాకుండా ఆమె జీవితంలో చేయాల్సిన పనులు మిగిలిపోయి ఉంటే బతుకుతుంది అనుకున్నాను. ఇందుకోసం నేను ఐసీయూలో ఆమె బెడ్ పక్కనే కూర్చుని అమ్మా నేను మంచోడ్ని కాదు. చెల్లె్ల్ని సరిగ్గా చూసుకోను. తనకు పెళ్లి చేయను. నేను పని చేయను. తాగుడుకు బానిసవుతాను అంటూ ఇలా చెడ్డ మాటలు చెప్పాను. ఇవన్నీ విని నా కొడుకు, కూతురిని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అని అమ్మ అనుకుని బతుకుతుందని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. అమ్మ మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది’ అని తెలిపారు షారుక్. షారుక్ మాటలకు డేవిడ్ లెటర్‌మ్యాన్ మాత్రమే కాదు అక్కడే ఉన్న ప్రేక్షకులు కూడా షాకయ్యారు.

Related posts