వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ మహిళా నేత సాధినేని యామిని మండిపడ్డారు. ఈరోజు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీపై విమర్శలు చేయడమే విజయసాయిరెడ్డి ధ్యేయమని విమర్శించారు. ఆయనకు రోజురోజుకు మతిభ్రమిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయడంలేదు. గవర్నమెంట్ ఆఫీసులు, విద్యాశాఖ, ప్రభుత్వ ఆసుపత్రులు ఏవీ సరిగ్గా ఉండడంలేదు.
విజయసాయిరెడ్డి హైదరాబాద్ లోనే కూర్చుని ఉన్నారు కాబట్టి, ఆయనకు సరైన చికిత్స అందుతున్నట్టు లేదన్నారు. టీడీపీపై విమర్శలు చేయడం ద్వారా బీజేపీకి మేలు చేయాలని చూస్తున్నారు.విజయసాయిరెడ్డి పేరు వీస రెడ్డిగా మార్చుకున్నారన్నారు. మే 23 తర్వాత విజయసాయిరెడ్డి విదేశాలకు పారిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. విజయసాయిరెడ్డి గెలుస్తాం..గెలుస్తాం అని అరవడం వల్ల అలుపు తప్ప ఏమీరాదని, గెలవాలంటే ముందు ప్రజల మనసు గెలవాలని హితవు పలికారు.
పోతిరెడ్డిపాడును జగన్‌కు కేసీఆర్ గిఫ్ట్‌గా ఇచ్చారు: రేవంత్‌రెడ్డి