telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత యువ వికెట్ కీపర్ పై మాజీ వికెట్ కీపర్ ప్రశంసలు…

భారత యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడడంతో మొత్తం ఐపీఎల్ 2021‌కు దూరమయ్యాడు. అయ్యర్‌ గైర్హాజరీలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం నాయకత్వ బాధత్యలు అప్పజెప్పింది. అయితే ఈ విషయం పై పార్థివ్‌ పటేల్‌ మాట్లాడుతూ… ‘ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంతే ఎక్స్‌-ఫ్యాక్టర్‌. గత సీజన్‌కు అతడు అత్యుత్తమ ఫామ్‌లో లేడు. అయినా కూడా కొన్ని మ్యాచులలో బాగానే ఆడాడు. ఈసారి టీమిండియాకు మాత్రం అదరగొట్టాడు. ఆస్ట్రేలియా. ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతాలు చేశాడు. అదే ఆత్మవిశ్వాసాన్ని ఐపీఎల్ టోర్నీకి కూడా తీసుకొస్తున్నాడు. నిజానికి టీ20లకు కావాల్సింది అదే. ఎందుకంటే మనసులో ఎలాంటి సందేహాలూ ఉండకూడదు. ముఖ్యంగా పంత్‌ లాంటి ఆటగాడికి అస్సలు ఉండొద్దు’ అని అన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీతో పోలికల వల్ల రిషబ్ పంత్‌పై అధిక భారం పెరిగింది. అందుకు తగ్గట్టే పంత్ ప్రయత్నించాడు. వాస్తవంగా పంత్ ‌స్వయంగా ప్రతిభాశాలి. ధోనీలా ఆడాలని అతడు ఆందోళన చెందకూడదు అని తెలిపారు.

Related posts