ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. 70 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సిక్కిం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త చీఫ్‌లను నియమించింది. మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, జబల్పూర్ ఎంపీ రాకేశ్ సింగ్ స్థానంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఖజురహో ఎంపీ విష్ణుదత్ శర్మను నియమించగా, సిక్కిం బీజేపీ చీఫ్‌గా దల్ బహదూర్ చౌహాన్‌ను నియమించింది. కేరళ అధ్యక్షుడిగా కె.సురేంద్రన్‌లను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.