telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.. వ్యాపారాలు పుంజుకుంటాయి..

today rasi falalu

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
వ్యూహాత్మకంగా వ్యవహారాలు పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగి ఊరట చెందుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో కొత్తహోదాలు దక్కే అవకాశం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
పలుకుబడి మరింత పెరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. సేవా, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, గృహయోగాలు ఉండవచ్చు. మీ సత్తా పదిమందిలోనూ చాటుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. గులాబీ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్తగా చేపట్టిన పనులు పూర్తి చేయడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల సలహాలు స్వీకరించి ముందడుగు వేస్తారు. చాకచక్యంగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన రావచ్చు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొన్ని నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. శత్రువులనే వారు కూడా మీ పట్ల ప్రేమాభిమానాలు చూపుతారు. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు లేదా ఇంక్రిమెంట్లు లభించవచ్చు. రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. మీ యుక్తితో వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుటారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త ఉద్యోగాలు దక్కే సూచనలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని పనులు శ్రమానంతరం విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు మొదట్లో కొంత నిరాశ పరుస్తాయి. అయితే అవి క్రమేపీ అనుకూలిస్తాయి. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. ఉద్యోగ యత్నాలు ఫలించే సమయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులకు గురవుతారు. తెలుపు, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు వస్తాయి. దూరపు బ«ంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. మిత్రులతో వివాదాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులు చేపట్టి సమయానుసారం పూర్తి చేస్తారు. వ్యతిరేకులను అనుకూలురుగా మార్చుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగి లబ్ధి పొందుతారు. వాహనయోగం. మీ నిర్ణయాలను అందరూ స్వాగతిస్తారు. కొన్ని కాంట్రాక్టులు సైతం దక్కించుకుంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు పొందుతారు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఎరుపు,నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
అనుకున్న విధంగా పనులు సాగుతాయి. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. బంధువులు, మిత్రులు సహకారం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ జీవితాన్ని మంచి మలుపు తిప్పే సమాచారం అందవచ్చు. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే అవకాశం. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మొదట కొన్ని సమస్యలు ఎదురైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. మీ మనస్సులోని అభిప్రాయాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. తీర్థయాత్రలు సాగిస్తారు. సన్నిహితుల సాయం పొందుతారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కే అవకాశాలు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ఊరట చెందుతారు. ఉత్సవాలలో పాల్గొంటారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. కొత్తగా రుణాలు చేస్తారు. చేపట్టిన పనులు ఎవరో ఒకరి సాయంతో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొనే అవకాశం. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యంపై దృష్టి సారించండి, వైద్యసలహాలు పొందుతారు. ఆస్తుల విషయంలో బంధువర్గంతో కొద్దిపాటి సమస్యలు ఉండవచ్చు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడతాయి. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నూతన పరిచయాలు. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

Related posts