telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ను నిల్వ చేయడం అసాధ్యమంటున్న శాస్త్రవేత్తలు…

corona vacccine covid-19

ప్రపంచం అంత ఇప్పుడు కరీనా మందు గురించి ఆలోచిస్తుంది. అయితే కరోనాను నియంత్రించేందుకు దాదాపుగా పూర్తయినా ఏకైక వ్యాక్సిన్ పీఫైజర్. శరీరంలోని రోగనిరోధక శక్తిని జాగృతం చేసి వైరస్‌తో పోరాడేలా చేసేందుకు ఈ వ్యాక్సిన్‌లో సింథటిక్ ఆర్‌ఎన్ఏను వినియోగించి అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ త్వరగా పూర్తయి మార్కెట్‌లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచ దేశాలన్నీ వేచి చూస్తున్నాయి. అందులో భారత్‌ కూడా ఒకటి. అయితే ఈ వ్యాక్సిన్ తయారీ, మార్కెట్‌లోకి విడుదల ఎప్పుడనేది అటుంచితే.. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ను నిల్వ చేయడం అసాధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగానే కోవిడ్ వ్యాక్సిన్‌ను శీతల ఉష్ణోగ్రతల్లో నిల్వచేయాల్సి ఉంటుంది. అయితే పీఫైజర్ వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు అత్యంత శీతల వాతావారణం అవసరం. దాదాపు మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో దీనిని నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇదే ప్రస్తుతం భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. వ్యాక్సిన్ తయారీ నిపుణుడు గంగదీప్ కంగ్ మాట్లాడుతూ, భారత్‌లో పీఫైజర్ వ్యాక్సిన్‌ను నిల్వ చేయడం అసాధ్యమని, అంత శీతల స్థాయిలో శీతల గిడ్డంగులు భారత్‌లో లేవని తేల్చి చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో భారత్‌ నిర్వహిస్తున్న యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేసిన శీతల గిడ్డంగుల్లో కేవలం 2 నుంచి 8 డిగ్రీల మేర మాత్రమే శీతల వాతావరణాన్ని కల్పించడగలమని, ఈ వాతావరణంలో పీఫైజర్‌ను నిల్వచేయడం అసాధ్యమని చెబుతున్నారు.

Related posts