telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దుండిగల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ త్వరలో ప్రారంభం – కమిషనర్ రోనాల్డ్ రోస్

దుండిగల్ 14.5 మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శుక్రవారం ఈ.పి.టి.ఆర్.ఐ డైరెక్టర్ జనరల్ వాణి ప్రసాద్ తో కలిసి కమిషనర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… 14.5 మెగావాట్ల సామర్థ్యం తో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సుమారు 800 టి.పి.డి ఆర్.డి.ఎఫ్ వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్, ఈ పి టీ ఆర్ ఐ డైరెక్టర్ జనరల్ వాణి ప్రసాద్ తో కలిసి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పలు యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ర్యాంపు, ఆర్ డి ఎఫ్ టైపింగ్ హాల్ పిట్ టర్బైన్ జనరేటర్, మాస్టర్ కంట్రోల్ రూం బాయిలర్, బూడిద పిట్ ఎఫ్ సి జి ఎస్ చిమ్నీ, ఏ సి సి, స్విచ్ యార్డ్ యూనిట్ లను పరిశీలించారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలన్నారు. ప్లాంట్ కు సంబంధించిన స్టిచ్చింగ్ స్టేషన్, కంట్రోల్ రూమ్ పనులు పూర్తయిన నేపథ్యంలో ప్లాంట్ ను ఛార్జ్ చేసేందుకు ట్రాన్స్మిషన్ లైన్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను, ఏజెన్సీ నీ ఆదేశించారు.

కమిషనర్ వెంట ఎస్.డబ్ల్యూ ఎం ఎస్ సి కోటేశ్వర రావు, అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి, రీల్ (రాంకీ) డైరెక్టర్ వి.ఎస్ వెంకటేశన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శాస్త్రి, తోట కృష్ణారావు, HIMSW L లిమిటెడ్ ప్రాజెక్ట్ హెడ్, బి జి జి హెడ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
————————————————

– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.

Related posts