telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికే ఈ బ్యాన‌ర్‌ను పెట్టాను… నాని

Nani

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందిన చిత్రం ‘హిట్‌’. ‘ది ఫ‌స్ట్ కేస్‌’ ట్యాగ్‌లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 28న విడుదలకాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్రయూనిట్ సమావేశమైంది.ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు నాని మాట్లాడుతూ.. ఫిబ్రవరి 28న సినిమా విడుదలవుతుంది. చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రేక్ష‌కుల రెస్పాన్స్ కోసం ఆతృత‌గా వెయిట్ చేస్తున్నాం. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది. గ‌త రెండు మూడేళ్లుగా తెలుగులో కొత్త కంటెంట్ సినిమాలు అన్నీ స‌క్సెస్ అవుతున్నాయి. స‌పోర్ట్ చేస్తున్న అంద‌రికీ థ్యాంక్స్‌. అన్ని చోట్ల నుంచి పాజిటివ్ బ‌జ్ వ‌స్తుంది. ప్రామిస్‌గా చెబుతున్నాను సినిమా న‌చ్చి.. మ‌ళ్లీ మీ స్నేహితుల‌తో, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తోనో వెళ‌తారనే న‌మ్మ‌కం ఉంది. సినిమాను చూసిన వారు సినిమా గురించి ఎక్కువగా రివీల్ చేయకుండా చూడాలని నిర్మాతగా చెబుతున్నాను. శైలేష్ క‌థ న‌చ్చ‌డంతో నిర్మాత‌గా మారాను. అంద‌రం క‌లిసి విశ్వ‌క్ అయితే ఈ సినిమాకు న్యాయం చేస్తాడ‌ని భావించాం. హిట్ అంటే హోమిసైడ్ ఇంట‌ర్వెన్ష‌న్ టీమ్ అని అర్థం. అంటే ఓ ప్ర‌మాదం జ‌రుగబోతుంద‌ని ముందే ఊహించి దాన్ని జ‌ర‌గకుండా చూసే టీమ్. ఈ సినిమా స్నీక్ పీక్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మా బ్యాన‌ర్‌లో కంటెంట్‌కు ప్రాధాన్య‌త ఉన్న సినిమాల‌నే నిర్మిస్తాం. కొత్త కాన్సెప్ట్‌, టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికే ఈ బ్యాన‌ర్‌ను పెట్టాను. ఇందులో స్టార్ డైరెక్ట‌ర్స్ సినిమాలు చేయ‌రు. అలాగే నేను కూడా నా బ్యాన‌ర్‌లో న‌టించ‌ను. నాకు క‌థ న‌చ్చి నేను చేయ‌లేని సినిమాల‌ను నా బ్యాన‌ర్‌లో నిర్మిస్తాను. ఇది వ‌ర‌కు మా బ్యాన‌ర్‌లో కొత్త‌గా చేసిన ‘అ!’ సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈసారి మ‌రో కొత్త జోన‌ర్‌తో మీ ముందుకు వ‌స్తున్నాం. నేను ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు సార్లు సినిమా చూశాను. ఒక్కసారి కూడా బోర్ కొట్ట‌లేదు. పిబ్ర‌వ‌రి 28.. ఈ సినిమాకు ఫ‌ర్‌ఫెక్ట్ రిలీజ్ అనిపించింది. రిలీజ్ రోజే రాజ‌మౌళిగారు కూడా సినిమాను చూడ‌బోతున్నారు. నిర్మాత ప్ర‌శాంతి గారు మా ఫ్యామిలీ మెంబ‌ర్‌. చాలా టాలెంటెడ్. ఆమె లాంటి వ్య‌క్తులు.. మంచి టీమ్ ఉండ‌బ‌ట్టే నేను సినిమాల్లో న‌టిస్తూ.. సినిమాల‌ను నిర్మించ‌గ‌లిగాను అన్నారు.

Related posts