telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తలసానిపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. మోగొడివైతే ఆ పనిచేయి !

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించలేకపోతుందని కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. అంతేకాదు మంత్రి తలసానికి జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఇంట్లో కూర్చొని మాట్లాడొద్దని..తెలంగాణ ప్రజల ప్రాణాలతో కామెడీ చేయొద్దని చురకలు అంటించారు. సంగారెడ్డికి ఆసుపత్రికి రండి పోదామని.. కేసులు తగ్గాయని అని రుజువు చేస్తారా..? అని సవాల్ విసిరారు. సీఎం దగ్గర మంచి పెరుకోసం భజన చెయ్యకు.. కేంద్రం మీద కోట్లాది… రాష్ట్రంకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. అంత మోగొడివి అయితే కిషన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలని.. గాంధీ ఆసుపత్రికి పొయ్యి చూడాలని చురకలు అంటించారు.
రాష్ట్రంలో రెమిడేసివర్ ఇంజెక్షన్ కొరత ఎక్కువైందని.. కరోనా బాధితుల పేరెంట్స్ బ్లాక్ లో కొందాం అనుకున్న దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యం 200 పై చిలుకు జనం చనిపోతున్నారని..కేంద్రం తెలంగాణను అశ్రద్ద చేస్తుందని ఫైర్ అయ్యారు. నలుగురు బీజేపీ ఎంపిలు, కేంద్రమంత్రి.. మోడీ దగ్గర కూర్చొని రెమిడేసివర్ సంఖ్య ఎందుకు పెంచడం లేదని నిలదీయాలని డిమాండ్ చేశారు. వేస్ట్ మాటలు చెబుతూ.. బీజేపీ రాజకీయం చేస్తుందని నిప్పులు చెరిగారు. మొక్కుబడిగా తెలంగాణకు కేటాయింపులు ఉన్నాయని.. ఇదేమైనా ప్రసాదమా… ? కొంచెం కొంచెం పెట్టడానికి అంటూ ఫైర్ అయ్యారు. ఇదో రోగం… మెడిసిన్ ఎక్కువ అడుబాటులో ఉంచాలి.. కంపెనీ ధరకే రెమిడేసివర్ దొరుకుంతుంది అనే భరోసా ఇవ్వాలన్నారు.

Related posts