జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సాహసోపేత నిర్ణయంగా వర్ణించారు. ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడుతూ.. అధికరణను రద్దు చేయడం బీజేపీ మూల సిద్ధాంతాల్లో ఒకటని తెలిపారు. జనసంఘ్ రోజుల నుంచే ఈ ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
జమ్ముకశ్మీర్ లో శాంతి, సుఖ సంతోషాల దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం ఇదో గొప్ప ముందడుగని అభివర్ణించారు. ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు అద్వానీ అభినందనలు తెలిపారు. జమ్ముకశ్మీర్, లడఖ్‌లో శాంతి, సుఖ సంతోషాల స్థాపనలో ఈ నిర్ణయం కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు.
బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్: మాజీ ఎంపీ హర్షకుమార్