telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యం..అదే టార్గెట్

హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా హైద‌రాబాద్‌లో ఈ సమావేశాల‌ను బీజేపీ నిర్వ‌హిస్తోంది.

పార్టీ విస్తరణ, మోదీ పాలను ప్రజల్లోకి తీసుకెళ్లడతో పాటు వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేదుకు వ్యూహాలు రచిస్తోంది.

రెండురోజుల పాటు జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులతో పాటు జాతీయ స్థాయి నేతలు స‌హా మొత్తం 345 మందికి పైగా హాజరుకానున్నారు

ఇప్పటికే కొందరు జాతీయ నేతలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన విధానంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.

వచ్చే ఏడాది జరగననున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలు, 2024 లోక్‌ సభఎన్నికలు, పార్టీ విస్తరణ వంటి వాటిపై కూలంకషంగా చర్చించనున్నారు. వీటిపై చర్చించి బీజేపీకి రూట్ మ్యాప్ ను ఈ సమావేశాల్లోనే నిర్ణయించనున్నారు. వీటిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు.

ఇప్పటకే రెండు సార్లు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. భారత్ లోని అత్యధిక రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో అది బీజేపీ ఖాతాలో పడేలా వ్యూహాలను రచించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ లోనూ రెండోసారి అధికారం దక్కించుకున్న బీజేపీ త్వరలో జరగనున్న గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికలపై ఈ సమావేశాల్లో ముఖ్యంగా చర్చించనుంది. దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేసే అంశంపై కూడా ప్రధానంగా చర్చించనుంది.

అంతేకాకుండా కేసీఆర్ టార్గెట్ గా టీఆర్ ఎస్ వైఫ‌ల్యాల‌ను కూడా ఇంటింటికి తీసుకెళ్లేలా క‌ర‌ప‌త్రాల‌ను వేయించాల‌ని వ్యూహ‌ర‌చన చేసింది. అలాగే అగ్నిఫ‌థ్‌పై యువ‌త‌లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను పొగొట్టేందుకు తీసుకోవాల్సిన నిర్ణ‌యాల‌పై చ‌ర్చించి తీర్మానాలు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఈ సమావేశాల్లో పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు ల‌క్ష్యంగా కొన్ని నిర్ణ‌యాలు తీసుకోబొతున్న‌ట్లు తెలుస్తోంది.

Related posts