నగరంలో పారిశుద్యం పై మరింతగా కఠిన చర్యలకు పూనుకున్నారు అధికారులు. ఇకమీదట రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మితే జరిమానా కట్టడానికి సిద్ధంగా ఉండాల్సిందే. తాజాగా, ఓ ఆర్టీసీ డ్రైవర్ రోడ్డుపై ఉమ్మి వేసినందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఫైన్ విధించి అతడికి షాకిచ్చారు.
ఈ రోజు ఉదయం పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు ఊడ్చిన తర్వాత కుషాయిగూడ డిపోకు చెందిన AP28 Z3676 ఆర్టీసీ బస్ డ్రైవర్ జగదీశ్ రోడ్డుపై ఉమ్మి వేశాడు. దీన్ని గమనించిన అధికారులు అతడికి రూ.100 జరిమానా విధించారు. ఇక మీదట ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబుపై తమకు ఎలాంటి కక్ష లేదు: మంత్రి బొత్స