telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భారత రాజ్యాంగ పరిధిలోనే పోరాడుతా: పవన్ కల్యాణ్

pawan-kalyan

హిందూ ధర్మానికి ఏ మాత్రం నష్టం కలిగేలా ప్రవర్తించినా నేను మాట్లాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. విజయవాడ కనకదుర్గ ఆలయం ఎదురుగా ఉండే పుష్కర ఘాట్ లో సామూహిక మతమార్పిడులు జరుగుతుంటే అవి వైసీపీ నేతలకు కనపడట్లేదని విమర్శించారు.

వేరే మతానికి అన్యాయం జరుగుతుంటే ఎలా స్పందిస్తానో, అలాగే, నేను పాటించే హిందూమతానికి అన్యాయం జరిగినప్పుడు కూడా అలాగే స్పందిస్తాను. దీనివల్ల ఓట్లు వస్తాయా? ఓట్లు పోతాయా? అన్న విషయం నాకు తెలియదు. కానీ, భారత రాజ్యాంగ పరిధిలోనే నేను పోరాడుతాను’ అని చెప్పారు.హిందూ ధర్మానికి ఏ మాత్రం నష్టం కలిగేలా ప్రవర్తించినా నేను మాట్లాడతానని అన్నారు.

కడప దర్గాకు పోయి ఏ హిందువూ జై భవానీ అనడు. మెదక్ చర్చిల వద్దకు వెళ్లి జై శ్రీరామ్ అనడు. మరి అలాగే, హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్లి జై జీసస్ అనకూడదు. అది ధర్మ విరుద్ధం. దీన్ని కచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకిలా చేస్తున్నారు? అన్యమత ప్రచారం వద్దు’ అని పవన్ వ్యాఖ్యానించారు.

Related posts