telugu navyamedia
తెలంగాణ వార్తలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయను..

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో ఈ సారి సంగారెడ్డిలోని పార్టీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వనున్నట్టుగా చెప్పారు.

హైదరాబాద్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీకి క్యాడర్ ముందుకు రాకుంటే.. తన భార్య నిర్మలను బరిలో నిలుపుతానని తెలిపారు. తాను మళ్లీ 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.

రాజకీయ వ్యుహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని ఒక్క టర్మ్‌ ఎందుకు దూరంగా ఉంటున్నానో తర్వాత తెలుస్తుందన్నారు. 

ప్రజా సమస్యలపై చర్చిద్దామంటే.. అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయిలో జరగడం లేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అర్ధరాత్రి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగేవి కానీ.. కేసీఆర్ సీఎం అయ్యాకా… ప్రతిపక్షాలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని వాపోయారు. ఆరు నెలల తర్వాత జరిగే సమావేశాలు మూడు రోజులకే పరిమితమా..? వీఆర్ఏలు రాష్ట్రం వచ్చాక ఆగమయ్యారు.

మంత్రలు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పైరవీలు చేసుకుని బతుకుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల గురించి ముఖ్యమంత్రిని అడిగే పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు లేరని అన్నారు

Related posts