telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

భారత్‌ బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు… కమలనాథుల ఆగ్రహం

ఢిల్లీలో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రైతులు చేస్తున్న పోరాటంలో భాగంగా నిర్వహించిన భారత్‌ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపడంపై కమలనాథులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు ఇప్పుడు కేంద్ర సర్కార్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారిపోయాయి. ప్రస్తుతం తెలంగాణ సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతున్నారు బీజేపీ నేతలు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇంచార్జి మురళీధర్‌రావు.. వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో కేంద్రం లోతుగా చర్చిస్తోందని తెలిపారు.. రైతుల మేలు కోసం సంస్కరణల విషయంలో కేంద్రం ముందుకు వెళ్తోందని స్పష్టం చేసిన ఆయన.. కేసీఆర్ భారత్ బంద్‌కి మద్దతు ఇచ్చినా.. బంద్ మాత్రం విజయం కాలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు విధానాలపై ప్రజల మధ్య చర్చకు బీజేపీ సిద్ధం అవుతోందని.. మీరు ఫాక్ట్ షీట్ తీసుకొస్తే మేం ఛార్జ్ షీట్ తెస్తామని హెచ్చరించారు. కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న ఆరు నిర్ణయాల వల్ల తెలంగాణ రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ రైతాంగం విషయంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించిన ఆయన.. విజన్ లేదు, అవినీతి పెరిగింది, సమగ్ర పాలసీలు లేవు అని విమర్శించారు.

Related posts