దిగ్గజ దర్శకుడు, కేంద్ర మాజీమంత్రి, దివంగత దాసరి నారాయణరావు కుమారుడు, నటుడు అరుణ్ కుమార్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. కొన్నాళ్లుగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరునిగా ఉంటూ వచ్చిన ఆయన అధికారికంగా ఆ పార్టీలో చేరారు. హైదరాబాద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. తాను పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
వైఎస్ జగన్.. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగన్ పాదయాత్ర సమయంలోనే అరుణ్ వైఎస్ఆర్ సీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ పాదయాత్ర ఆరంభించినప్పటి నుంచీ అరుణ్ పార్టీ సానుభూతిపరునిగా ఉంటూ వచ్చారు. ఇది వరకు దాసరి నారాయణరావు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కేబినెట్ లో బొగ్గు శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.
సలహాలు ఇస్తుంటే వైసీపీ నేతలు ఎదురుదాడి: చంద్రబాబు