telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఇంటింటికీ తిరిగిన కలెక్టర్ సిక్తాపట్నాయక్..

కోవిడ్ తొలి, మలి దశలు దాటొచ్చాం…. ఒమిక్రాన్… కోరలు చాస్తోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ స్వయంగా క్షేత్రస్థాయి సర్వేకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ వార్డు నెంబరు.29 తో పాటు పలుకాలనీల్లో ఇంటింటికి వెళ్లి టీకా వేసుకున్నారా? లేదా? ఎందుకు వేసుకోలేక పోయారనే విషయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కాపాడుకోవాలని సూచనలు చేశారు.

ఇంట్లో అందరు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని సూచించారు. ఇప్పటిదాకా టీకా తీసుకోని వారికి అవగాహన కల్పించి అక్కడికక్కడే టీకాలు వేయించారు. జిల్లాలోని ప్రజానీకానికి వ్యాక్సినేషన్ జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసి, కరోనా ఫ్రీ జిల్లాగా ప్రకటిస్తామన్నారు.

కోవిడ్, ఒమిక్రాన్ వైరస్ కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ప్రతిఒక్కరు తీసుకోవాల్సిందేనన్నారు. ప్రజలు వ్యక్తిగతంగా నిర్లక్ష్యంచేస్తే…. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కష్టమన్నారు. అనారోగ్య సమస్యలు రాకముందే… జాగ్రత్తపడటం మంచిదనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

Related posts