telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హత్యను గుండెపోటుగా మార్చారు : వైఎస్ వివేకా హత్యపై ఏబీవీ సంచలనం

వైఎస్ వివేకా హత్య ఘటన జరిగి రెండు యేండ్లు గడిచిన కేసు లో ఎలాంటి మార్పు లేదు. కానీ ఈ కేసు.. ఏపీ రాజకీయాలను రోజుకో మలుపు తింపుతోంది. ఈ కేసులో టిడిపి నాయకులు.. పదే పదే జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. అయితే తాజాగా వైఎస్ వివేకా హత్య ఘటనపై సీబీఐకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు లేఖ రాశారు. వివేకా హత్య సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు…తాజాగా ఆయన సీబీఐకి లేఖ రాయడంతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అచేతనత్వంతో ఉందని..సీబీఐ విచారణ మొదలై ఏడాది గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి లేదని సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు ఏబీ. వివేకా హత్యకేసు సమాచారం ఉందని సీబీఐకి రెండుసార్లు తెలిపానన్న ఏబీవీ…దర్యాప్తు అధికారి ఎన్.కే సింగ్ కు తాను ఫోన్ చేసినా స్పందన లేదని వివరించారు. హత్యను గుండెపోటు, ప్రమాదంగా చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు యత్నించారని ఏబీ స్పష్టం చేశారు. వివేకా హత్య తర్వాత ఇల్లంతా కడిగేసి శవాన్ని ఆస్పత్రికి తరలించేదాకా ఘటనాస్థలాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి తన అదుపులో ఉంచుకున్నారని లేఖలో పేర్కొన్నారు ఏబీవీ. ఆ సమయంలో మీడియాను, ఇంటలిజెన్స్ సిబ్బందిని అనుమతించలేదని వెల్లడించారు.

Related posts