telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల వైకుంఠపురంలో : నివేదా పెతురాజ్ లుక్ విడుదల

AY

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాముల’, ‘ఓ డాడీ’ పాటలు చిత్రంపై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. అతి త్వ‌ర‌లో చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నివేదా పెతురాజ్ లుక్ తాజాగా విడుద‌ల చేశారు మేక‌ర్స్. నివేదాకి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తూ పోస్ట‌ర్ రూపొందించారు.

Related posts