అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. జిల్లాలోని కదిరి నియోజకవర్గం నంబులపూలకుంటలో బుధవారం సోలార్ పవర్ ప్లాంట్‌లో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీ బ్రాండ్ ఇమేజ్ను వైసీపీ నాశనం చేసింది: యనమల