telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2020 : మ్యాచ్ గెలిచి టాప్ 4 లోకి వచ్చిన పంజాబ్…

ఐపీఎల్ 2020 లో ఈ రోజు షార్జా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ బౌలింగ్ ఎంచుకుంది. అందువల్ల మొదట బ్యాటింగ్ కు వచ్చిన కోల్‌కత జట్టులో ఓపెనర్ శుబ్మాన్ గిల్ (57) అర్ధశతకం పూర్తిచేయడంతో ఆ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత 150 పరుగులతో వచ్చిన పంజాబ్ ఓపెనర్ల కేఎల్ రాహుల్, మన్‌దీప్ సింగ్ ఇటివంటి తొందర లేకుండా ఆటను ప్రారంభించారు. కానీ రాహుల్ 25 బంతుల్లో 28 పరుగులు చేసి ఔట్ అయిన తర్వాత గేల్ బ్యాటింగ్ కు వచ్చాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మ్యాచ్ విజయానికి మరో మూడు పరుగులు అవసరం అనే సమయంలో గేల్ 29 బంతుల్లో 51 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పురాన్ రెండు పరుగులుచేయగా మ్యాచ్ మిగిలిన ఒక పరుగు తీసి జట్టుకు విజయాన్ని అందించిన మన్‌దీప్ 56 బంతుల్లో 66 పరుగులు చేసాడు. అయితే గేల్, మన్‌దీప్ ఇద్దరు అర్ధశతకాలు బాదడంతో 18.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది పంజాబ్. అయితే ఇది కింగ్స్ ఎలెవన్ కు వరుసగా 5వ విజయం కాగా ఐపీఎల్ 2020 లో ఆరవది. దీంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. అలాగే పరాయజం పొందిన కోల్‌కత 5వ స్థానానికి వచ్చింది.

Related posts