విజయవాడలో జనసేన జెండా దిమ్మె ధ్వంసం ఘటనపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు . పోలీసుల తీరు మారకుంటే తానే రోడ్డెక్కుతానని హెచ్చరించారు .శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనే సంయమనం పాటిస్తున్నానని పవన్ స్పష్టం చేశారు
వైసీపీ సర్కార్‌లో భయం మొదలైందలైందని, విజయవాడ, జగ్గయ్యపేటలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణను వైసీపీ అడ్డుకోవడం వారిలోని ఓటమి భయాన్ని చెబుతోందని పవన్ అన్నారు.
జనసేన జెండా దిమ్మెను కూల్చినవారిపై కేసులు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించినవారిపై మాత్రమే కేసులు పెడుతున్నారని అన్నారు. ఇది ఎంతవరకు న్యాయమే పోలీసులు ఆలోచించాలని ఆయన సూచించారు.
అనుమతులు లేకపోతే వాటిని తొలగిస్తారా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అధికార పార్టీ అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తోందా అని ఆయన ప్రశ్నించారు. అన్నింటికీ అనుమతులు వున్నాయని పోలీసులు ప్రకటించగలరా అని పవన్ కల్యాణ్ నిలదీశారు
జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరితరం కాదన్నారు. ప్రజలే జనసేన పార్టీని కాపాడుకుంటారని చెప్పారు. శాంతి భద్రతలకు ఇబ్బంది రాకూడదనే తాను రాలేదన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను రోడ్డెక్కడం తప్పద్దన్నారు.