telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబు రెఫరెండం సవాలుపై సజ్జల కౌంటర్…

Sajjala ycp

చంద్రబాబు రెఫరెండం సవాలుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. దమ్ముంటే సీఎం జగన్, కెసిఆర్ లా చేయాలనీ ట్వీట్ చేశారు సజ్జల. “రెఫరెండంకు రెడీనా అని చంద్రబాబుగారు అడుగుతున్నారు. తాను నమ్మిన అంశాల మీద నమ్మకం, విశ్వాసం ఉండే నాయకులు ఏంచేశారో ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. కాంగ్రెస్‌ నుంచి వేరుపడ్డ సమయంలో జగన్‌గారు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌గారు ఏం చేశారో మనకు తెలిసిందే. వారి ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజలముందుకు వెళ్లారు. సీఎం జగన్ ‌గారు, కేసీఆర్‌గారిలానే చంద్రబాబుగారు కూడా తాను చెప్తున్న మాటలమీద ఆయనకు నమ్మకం ఉంటే ఇప్పుడు ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తే, ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలుతుంది కదా? ” అంటూ తనదైన స్టైల్ లో విమర్శలు సంధించారు. కాగ… ప్రజలు 3 రాజధాని లకు మద్దతు అని చెపితే నేను రాజకీయలనుండి తప్పుకుంటానని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్, విశాఖపట్నంలను అక్కడ కులం ఉందని అభివృద్ధి చేయలేదు. పులివెందుల కు నీరు ఇచ్చామని ఆన్నారు. దుశ్శాసణుడు ద్రౌపది చీరను పట్టుకున్నందుకు ఆ రాజ్యం నాశనం అయిందన్న ఆయన ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురు కానుందని అన్నారు. హైదరాబాద్ లో నీళ్లు లేక పోతే కృష్ణ నది నుండి నీరు పట్టికెళ్లామని కానీ ఇక్కడ పుష్కలం గా కృష్ణ నీళ్లు ఉన్నాయని ఆయన అన్నారు. 

Related posts