telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అధికారంలో వస్తే ప్రతిఏటా ఉద్యోగాల క్యాలెండర్‌: జగన్

YS Jagan Files Nomination Pulivendul

తాము అధికారంలోకి వస్తే ప్రతిఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కర్నూలు జిల్లా నందికొట్కూరు ర్యాలీలో ప్రసంగించారు. తొలిఏడాదే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాంలోని పరిశ్రమల్లో ఇప్పుడు చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారని, అన్ని పరిశ్రమల్లో స్థానికలకే 75శాతం ఉద్యోగాలు కల్పించే విధంగా శాసనసభలో చట్టం చేస్తామని చెప్పారు.

చంద్రబాబు హయాంలో పేదల బతుకులు ఏ మాత్రం మారలేదని ఆయన అన్నారు. చంద్రబాబు దేశంలో అత్యంత ధనిక సీఎంగా నిలిచారని జగన్ వ్యాఖ్యానించారు. సీఎంగా రైతులను, నిరుద్యోగులను పక్కన పెట్టి పేదలసొమ్ముని దోచుకున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కువ రుణభారం మన రాష్ట్రానికి చెందిన రైతులపైనే ఉందని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టుల పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని, రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

Related posts