telugu navyamedia
తెలంగాణ వార్తలు

బిజెపికి కౌంటర్: సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా జరపాలని కేబినెట్‌ నిర్ణయించింది.

అంతేకాదు.. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.

2023 సెప్టెంబర్‌ 16,17, 18న ముగింపు వేడుకలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టి.. ఈ ఏడాది సెప్టెంబర్17 నాటికి 75 ఏళ్లు పూర్తయ్యిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది.

దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు సీఎం కేసీఆర్‌. అలాగే ప్రభుత్వ బిల్లులపై కూడా చర్చించారు.

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్ర సర్కార్‌ వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించారు. ఇక సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వరాదన్న అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో పాల్గొననున్నారు.

.

Related posts