డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ “టెంపర్” తర్వాత మంచి హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన పూరీకి “ఇస్మార్ట్ శంకర్” చిత్రం ఉపశమనం కలిగించింది. చాలా రోజుల తర్వాత “ఇస్మార్ట్ శంకర్”తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అదే ఉత్సాహంతో త్వరలో విజయ్ దేవరకొండతో కలిసి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 28న పూరీ బర్త్‌డే కావడంతో ఆ రోజు ఇస్మార్ట్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారని అంటున్నారు. మరి ఆ రోజు విజయ్ దేవరకొండ, పూరీ మూవీకి సంబంధించి ఏదైన అప్‌డేట్ ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హీరో, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత పూరీతో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు.
previous post
భర్తను అవమానించిన వారికి గడ్డి పెట్టిన సింగర్ సునీత