దగ్గుపాటి రానా, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా విరాట పర్వం. సినిమాను నక్సలైగ్ రవన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో రానా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో సీనియర్ నటి టబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఈ మధ్యే ‘కోలు కోలు’ అంటూ సాగె ఓ పాట లిరికల్ వీడియోను విడుల చేసారు. ఇక తాజాగా ఈ రోజు మహిళా దినోత్సవం కానుక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే ప్రతి మహిళలతో ఓ పోస్టర్‌ను సిద్దం చేసి విడుదల చేసారు. అయితే ఈ సినిమా పై ఉన్న అంచనాలను ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ తారాస్థాయికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని మొదటి పాటను ఈనెల 25న విడుదల చేయనున్నారంట. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘కోలు కోలు’ అంటూ ఈ పాట సాగనుంది. ఇక ఈ సినిమా 1990నాటి నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కతోంది. ఈ సినిమాలో నక్సల్ నాయకుడు రవి అన్న పాత్రలో రానా కనిపించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. అయితే ఈ సినిమాపై అభిమానులు అంచనాలు బాగానే పెట్టుకున్నారు. మరి ఈ సినిమా వారి అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.
previous post