telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్ట్…

ఆస్ట్రేలియాతో గబ్బా టెస్ట్‌లో కుర్రాళ్లతో కూడిన భారత్ అసాధారణ పోరాట పటిమతో అనూహ్య విజయం సాధించి బోర్డర్-గావస్కర్ ట్రోఫిని కైవసం చేసుకున్నప్పుడు యావత్ దేశం ఎంతో గర్వించింది. స్వదేశం చేరిన ఆటగాళ్లపై పూల వర్షం కురిపించింది. ఆ విజయం భారత టెస్ట్ చరిత్రలోనే ఓ టర్నింగ్ పాయింట్ అవుతుందని అంతా భావించారు. కానీ మూడు వారాల్లోనే సీన్ రివర్సైంది. అయితే ఇదే చెన్నై వేదికగా నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధించాలంటే తుది జట్టులో మార్పులు జరగాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లను మార్చాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఫస్ట్ టెస్ట్‌లో అశ్విన్‌కు అండగా నిలిచే రవీంద్ర జడేజా లేని లోటు స్పష్టంగా కనిపించింది. అశ్విన్ కట్టడిగా బౌలింగ్ చేసినా సహచర స్పిన్నర్లు అయిన వాషింగ్టన్ సుందర్, షెబాజ్ నదీమ్ దారుణంగా విఫలమయ్యారు. కెరీర్‌లో రెండో టెస్ట్ మాత్రమే ఆడుతున్న ఈ ఇద్దరు దారళంగా పరుగులిచ్చుకున్నారు. కాబట్టి నదీమ్ స్థానంలో కుల్దీప్‌ను జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. గత కొంత కాలంగా బెంచ్‌కే పరిమితమవుతున్న కుల్దీప్.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. పైగా అతను చివరి సారిగా ఆడిన టెస్ట్‌లో 5 వికెట్లు తీశాడు. కాబట్టి అతను జట్టులోకి వస్తే మేలు జరుగుతుందనేది అందరి అభిప్రాయం.

Related posts