telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్టుల హెచ్చరిక

7 naxals died in jagadal pur encounter

మావోయిస్టుల ఏరివేత పేరుతో పోలీసులు అడవులను జల్లెడ పట్టడం ఆపాలని మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏటూరు నాగారం, భూపాలపల్లి ఏరియా కమిటీ కామ్రేడ్ ఉంగా పేరుతో ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శాపల్లి గ్రామంలో వాల్ పోస్టర్స్ అంటించారు. కూంబింగ్స్ ఆపకుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు భీమేశ్వర రావుకు పట్టిన గతే టీఆర్ఎస్, బీజేపీ నేతలకు పడుతుందని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. మాజీ మావోయిస్టు ముద్రబోయిన సంపత్ తన బొలెరో వాహనంలో పోలీసులను తప్పడం పద్ధతి కాదని..ప్రజల చేతులో శిక్ష తప్పదంటూ హెచ్చరించారు.

కాగా… వెంకటాపురం మండలం అలుబాకకు చెందిన టీఆర్‌ఎస్‌ నేత మూడురి బీమేశ్వర్‌ను కిరాతకంగా మావోయిస్టులు హతమార్చారు. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని బీమేశ్వర్‌ను బయటకు పిలిచి కత్తులతో విచక్షణ రహితంగా పొడిచారు. తనను చంపొద్దని ఎంత వేడుకున్నా కనికరించలేదు. రక్తపు మడుగులో పడి ఉన్న భీమేశ్వర్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడవకముందే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మావోయిస్టులు పోస్టర్స్ అంటించారు.

Related posts