బిగ్ బాస్ 3 తెలుగు షో లో ఈ వారం టాస్క్ చాలా కామెడీగా సాగింది. తమ కుటుంబ సభ్యులను కలిసి తమ అనుభూతులు పంచుకున్నారు. తమ కుటుంబ సభ్యులు రావడంతో ఒక్కసారిగా బిగ్ బాస్ కంటిస్టేంట్ల కళ్లలో ఆనందం మాటల్లో చెప్పలేం. ఇక శివజ్యోతి యథావిధిగా తన భర్త గంగూలీని చూడగాని ట్యాప్ ఒపెన్ చేసింది. తన భర్త పోయే వరకు ట్యాప్ కంటిన్యూ చేసింది..తీరా వెళ్లిపోయిన తర్వాత అలీతో తన భర్త ఎలాంటి ఎమోషన్ కావడం లేదు..చాలా హ్యాపీగా ఉన్నాడు..నేనంటే అస్సలే ప్రేమలేదా ఏంటీ? అని తెగ సందేహాలు వ్యక్తం చేసింది. శ్రీముఖి కూడా ఈసారి తన ట్యాప్ ఓపెన్ చేేసి బీభత్సం చేసింది. శ్రీముఖి తల్లి లత రాగానే అమ్మా..అమ్మా..అంటూ ఏడ్చేసింది. ఇక ఎమోషన్స్ అయ్యాక ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. శ్రీముఖి మహానటి, శివజ్యోతి చంద్రముఖి గంగ, బాబా భాస్కర్ భాష, రాహుల్ కాంచన గా, వరుణ్ సందేశ్, వితిక బాహుబలి సీన్లు చేసి రక్తి కట్టించారు. హౌస్ మేట్స్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై ఒకరితో మరొకరు డిస్కస్ చేసుకున్నారు. ఇక నామినేషన్స్ లో ఉన్న ఏడుగురు సూట్ కేసులు సర్దేయగా.. బాబా భాస్కర్ మాత్రం తన మీద నమ్మకంతో ఖాళీ సూట్ కేస్ పంపించారు.
తర్వాత ఇంటి సభ్యుల కు ఒక టాస్క్ ఇచ్చారు. మొత్తం ఏడు స్థానాల్లో ఎవరెవరు ఏ పొజిషన్ కి అర్హులో చెప్పాలని నాగార్జున చెప్పగా.. అలీ రెండో స్థానం, రాహుల్ నాలుగో స్థానం, బాబా మూడో స్థానం, వరుణ్ ఏడవ స్థానం, వితికా మూడవ స్థానంలో చూసుకుంటున్నామని వివరణ ఇచ్చారు. తర్వాత శ్రీముఖి, రాహుల్ కి మద్య పెద్ద వివాదం సాగింది. బిగ్ బాస్ లోకి తనను శ్రీముఖి రికమండ్ చేసినట్లు వితిక, వరుణ్ లు చెప్పిందిని రాహుల్ ఆరోపణ చేశాడు. తాను చెప్పలేదని..ఈ విషయం తమకు గుర్తు లేదని వితిక, వరుణ్ అన్నారు. దాంతో నాగార్జున కల్పించుకొని బిగ్ బాస్ లోకి ఎవరినీ రికమండ్ చేయరని..అందుకు అన్ని అర్హతలు ఉంటేనే తీసుకుంటారని అన్నారు. తర్వాత హౌస్ మేట్స్ కి చెందిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఒక్కొక్కరినీ స్టేజ్ మీదకి పిలిచి వారితో గేమ్ ఆడించాడు నాగార్జున. అలా గెస్ట్ లుగా వచ్చిన వారు హౌస్ లో ఉన్న తమ వారికి కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చారు. ఈ ప్రాసెస్ లో ఎవరు ఈ వారం సేవ్ అవ్వబోతున్నారో గిఫ్ట్స్ ద్వారా ఓ కార్డ్ పంపించి చెప్పించారు. ఈ వారం ఎలిమినేషన్ నుండి శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్ సేవ్ అయినట్లు అనౌన్స్ చేశారు.