telugu navyamedia
రాజకీయ

అద్భుతమైన తీగెల వంతెన విద్యాసాగర్ సేతు ..

మన హైదరాబాద్ నగరంలో దుర్గం చెరువు మీద తీగెల వంతెన నిర్మించినప్పుడు అది తెలుగు వారికి ఎంతో అబ్బురంగా అనిపించింది . ఇప్పుడు ఆ తీగెల వంతెన చూడటానికి ప్రజలు వస్తున్నారు . అది ఇప్పుడు హైదరాబాద్ నగరానికి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది . అయితే ఇలాంటి తీగెల వంతెన కు రూపకల్పన 50 సంవత్సరాలక్రితమే జరిగిందంటే నమ్ముతారా? పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రాజధాని కలకత్తాలో హుగ్లీ నది మీద దీనిని నిర్మించాలని సంకల్పించారు. ఇది కలకత్తా మరియు హౌరా ను కలిపే వంతెన.

1943లో కలకత్తాలో హుగ్ల్లీ నది మీద ఒక ఉక్కు వంతెన నిర్మిచారు. దీనిని హౌరా బ్రిడ్జి లేదా రవీంద్ర సేతు అంటారు. నిర్మిచిన తీగెల వంతెనను విద్యాసాగర్ సేతు లేదా రెండవ హుగ్ల్లీ బ్రిడ్జి అంటారు. 1972 మే 20 న అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ శంకుస్థాపన చేశారు. 10 అక్టోబర్ 1972లో దీనిని ప్రారంభించారు. భారత దేశములోనే తొలి కేబుల్ బ్రిడ్జి. దీనికి పండిట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ పేరు పెట్టారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 25 బిలియన్ లను ఖర్చు చేశారు.

File:Vidyasagar Setu Kolkata West Bengal.jpg - Wikimedia Commons

ఈ బ్రిడ్జి పొడవు 823 మీటర్లు అంటే 2700 అడుగులు. దీని వెడల్పు 35 మీటర్లు అంటే 115 అడుగులు .
దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఈ తీగెల వంతెనను నేను ఆదివారం రోజు సందర్శించాను. చిన్నగా వర్షం పడుతుంటే ఈ తెగేలా వంతెన మీదుగా హుగ్ల్లీ నదిని దాటటం మర్చిపోలేని అనుభూతి. నవరాత్రి సందర్భంగా కలకత్తా నగరాన్ని విద్యుత్ దీపతో అలంకరించారు. ఈ విద్యాసాగర్ సేతును విద్యుత్తు దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. కలకత్తా ను సందర్శించిన ఎవరైనా ఈ కేబుల్ బ్రిడ్జి ని తప్పకుండా సందర్శిస్తారు.
-భగీరథ
కోల్ కతా నుంచి ..

Related posts