టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సినిమాలు చూస్తూ, వాటి గురించి ట్విటర్ ద్వారా స్పందిస్తుంటారు. ఇటీవల ఎన్నికలతో బిజీ అయిపోయి సినిమాలు చూడలేకపోయిన కేటీఆర్ తాజాగా ఓ సినిమా గురించి ట్వీట్ చేశారు. దక్షిణాదిన `బాహుబలి` తర్వాత ఆ స్థాయి భారీ బడ్జెట్‌తో నిర్మితమై ఘన విజయం సాధించిన చిత్రం `కేజీఎఫ్` కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన ఈ సినిమా దక్షిణాది భాషలన్నింటిలోనూ విడుదలై విజయం సాధించింది. తాజాగా ఆ సినిమా చూసిన కేటీఆర్ ట్విటర్ ద్వారా చిత్ర బృందాన్ని ప్రశంసించారు.
`కొద్దిగా ఆలస్యంగానే అయినా ఎట్టకేలకు `కేజీఎఫ్` చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. సాంకేతికంగా, కథాపరంగా చాలా బాగుంది. పట్టుసడలని స్క్రీన్‌ప్లేతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను అద్భుతంగా రూపొందించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. స్క్రీన్‌ఫై రాక్‌స్టార్ యష్ నటన అదిరిపోయింద`ని కేటీఆర్ ట్వీట్ చేశారు.
బ్రేకప్ పై ఘాటుగా స్పందించిన శృతి హాసన్