telugu navyamedia
క్రీడలు వార్తలు

అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్…

ఈరోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాదించాడు. రాహుల్ టీ20 ఫార్మాట్‌లో 5000 పరుగులు పూర్తి చేశాడు. సన్‌రైజర్స్‌ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్లో సింగల్ తీయడంతో రాహుల్ టీ20 ఫార్మాట్‌లో 5000 పరుగుల మార్క్ అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ నిలిచాడు. కేఎల్ రాహుల్ ‌టీ20 ఫార్మాట్‌లో 143 ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు చేయగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 167 ఇన్నింగ్స్‌లలో ఆ మార్క్ అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా 173 ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు చేశాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు పూర్తిచేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా కూడా రాహుల్ రికార్డుల్లోకి ఎక్కాడు. విండీస్ హిట్టర్ క్రిస్ గేల్ 132 ఇన్నింగ్స్‌లలోనే ఆ మార్క్ చేరుకున్నాడు.

Related posts