telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రొమాంటిక్ మూడ్ కి అడ్డొచ్చిన జిరాఫీ…

jirafee

భారత సంతతికి చెందిన అమీశ్, మేఘనాలకు వివాహం వైభవంగా జరుగగా, వారిద్దరూ ఫొటోలు తీయించుకునేందుకు మలీబు ప్రాంతంలోని సాడల్ రాక్ వద్దకు వెళ్లారు.అక్కడ వీరిద్దరూ పోజులిస్తుండగా, పక్కనే ఉన్న ఫెన్సింగ్ వెనుక ఉన్న ఓ జిరాఫీ వారి వద్దకు వచ్చింది. అది ఏమైనా ఆకలితో వుందేమో… వరుడి తలపాగాను పట్టుకుంది. దీన్ని గమనించిన వధువు సిగ్గుపడుతూ జిరాఫీని వారించే ప్రయత్నం చేసినా, అది వినలేదు. ఈలోగా మరో వ్యక్తి వచ్చి, తలపాగాను జిరాఫీ నోటి నుంచి లాగేసి వరుడికి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఈ ఘటన కాలిఫోర్నియాలో జరిగింది.

Related posts