గడచిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ ఆ పార్టీకీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగాతెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి తన ట్విట్టర్ లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, “లక్ష్మీ నారాయణ గారూ, ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూశాం. పవన్ కల్యాణ్ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికొచ్చిన నష్టమేం లేదు. కానీ… రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం” అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఉత్తమ్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచాడు: జగదీశ్‌రెడ్డి