telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మరో ఫ్రీ ఆఫర్ ప్రకటించిన కేజ్రీవాల్ .. సెప్టిక్ ట్యాంక్ బాధ్యత ప్రభుత్వానిదేనట ..

kejriwal on his campaign in ap

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పలు ఫ్రీ పధకాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. మొన్న మెట్రోలో మహిళలకు ఫ్రీ.. నిన్న బస్సులో మహిళలకు ప్రయాణం ఫ్రీ.. ఇక పరిమిత కరెంట్ వాడితే వారికి బిల్లు ఫ్రీ.. ఇలా ప్రకటనలు చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తాజాగా మరో ఉచిత ప్రకటన చేశారు. ఇక నుంచి మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండితే ప్రభుత్వమే క్లీనింగ్ సర్వీసులను కల్పించనుంది. ‘ముఖ్యమంత్రి సెప్టిక్ ట్యాంక్ సఫాయి యోజన’ పేరుతో ఈ పథకాన్ని ప్రకటించారు. ఢిల్లీ జల్ బోర్డ్ ఇందుకోసం 80 ట్రక్కులను.. ప్రత్యేక సిబ్బందిని కూడా సిద్ధం చేస్తోంది. ఈ ట్రక్కులతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో సర్వీసులను అందించనున్నట్లు తెలిపారు. ఈ క్లీనింగ్‌కు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించనుంది.

నగరంలోని పలు అనధికార కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని.. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రైవేట్ సర్వీసులు డ్రైనేజీని ఎక్కడ పడితే అక్కడే వదిలేయడంతో.. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని.. అందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని కేజ్రీవాల్ తెలిపారు. అంతేకాకుండా ప్రైవేట్ సర్వీసులు సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో పాటుగా.. కావాల్సిన పరికరాలు లేకపోవడంతో.. వారు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతూ.. ప్రాణాలను ఫణంగా పెడుతున్నారన్నారు. దీంతో ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టేందుకు ‘ముఖ్యమంత్రి సెప్టిక్ ట్యాంక్ సఫాయి యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

Related posts