telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా అప్పుడే…

తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు జరగనున్నాయి. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో జరగాల్సిన ఉప ఎన్నికకు తేదీ ఖాయమైంది. అక్కడ ఈ నెల 23వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. మార్చి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఇక, 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్‌ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చిన ఎన్నికల సంఘం.. ఏప్రిల్ 17న ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నట్టు షెడ్యూల్‌లో పేర్కొంది. అయితే, ఫలితాలు మాత్రం మే 2వ తేదీన వెలువడనున్నాయి. ఇక, ఈవీఎంల ద్వారానే ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్టు స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇక, సర్వ సాధారణంగా ఎన్నికల్లో ఉండే అన్ని నిబంధనలు చెప్పుకొచ్చింది. అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కర్ణాటకలోని బెల్గామ్ లోక్‌సభ స్థానంతో పాటు.. మరో 14 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది సీఈసీ.

Related posts