వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకొని జోష్‌లో ఉన్న టీమ్‌ఇండియా వన్డే సమరానికి సిద్ధమైంది. స్వదేశంలో ఏ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరిగినా భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్, విండీస్ తొలి వన్డేలో తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన కరీబియన్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఒకవేళ తాము టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నట్లు భారత సారథి విరాట్ కోహ్లీ చెప్పాడు. గత టీ20 సిరీస్‌లో బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్‌లో దారుణంగా విఫలమైన రిషబ్ పంత్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకముంచింది.
తొలి వన్డే తుది జట్టులో పంత్ చోటు దక్కించుకున్నాడు. భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, శివమ్ దూబే, జడేజా, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, షమీ విండీస్: షెయ్ హోప్, సునీల్ ఆంబ్రోస్, హెట్‌మైర్, నికోలస్ పూరన్, రోస్టన్ ఛేజ్, పొలార్డ్, జేసన్ హోల్డర్, కీమోపాల్, హేడన్ వాల్ష్, ఆల్జారీ జోసెఫ్, షెల్డన్ కాట్రెల్.
దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్న జగనే దళితద్రోహి : కే.ఎస్. జవహర్ (మాజీ మంత్రి)