telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్‌ఎస్‌లో ముసలం…మంత్రి ఈటల రాజేందర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు !

సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పార్టీ టీఆర్‌ఎస్‌. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడ్డ టీఆర్‌ఎస్‌.. మొదటి నుంచి అనేక ఆటుపోటులను ఎదుర్కొంది. రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన టీఆర్‌ఎస్‌.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉంది. అయితే.. 2014 నుంచి ఇప్పటి వరకు ఎదురులేని పార్టీగా ఎదగడమే గాక.. ఎన్నో విజయాలను అందుకుంది. కానీ దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత డీలా పడింది. ఇక అప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రామ మందిరం, బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను బహిరంగంగానే ఈటల వ్యతిరేకించారు. ఇది మరువకముందే మంత్రి ఈటల రాజేందర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం, డబ్బు, పార్టీ జెండా కాదు…. మనిషిని గుర్తు పెట్టుకోవాలని…ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గాయపడినా తన మనసు మార్చుకోలేదని…20 ఏళ్ల ప్రస్థానంలో నన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారని ఆయన తెలిపారు. తాను ఉన్నంత వరకు ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. పెట్టిన చెయ్యి ఆగదు, చేసే మనిషినీ ఆగనని… ముంజేతి కంకణానికి అద్దం అక్కర్లేదు, తాను చేసిన పనులు చెప్పుకోనక్కర్లేదని ఈటల అన్నారు. చేసింది చెప్పుకోవద్దని.. అది గుండెల్లో ఉంటుందని పేర్కొన్నారు.  “మహాభారతంలో కౌరవులు, ధుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చింది.. అలాగే రామాయణంలో కూడా రాముడు ఉన్నాడు..  రావణుడు ఉన్నాడు.. అలాగే మన సమాజంలో కూడా అందరూ ఉంటారు. అందరూ ఒకే విధంగా ఉండరు. సమాజం ఆనాటి నుండి ఈనాటి వరకు మొత్తం ఒకటిగా ఉండదు, ఉంటే అది సమాజం కాదు. నాయకులంటే భారీ  ఆకారం, అభరణాలు, కులంతో పని ఉండదు ప్రజల కన్నీళ్ళు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషి.” అంటూ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Related posts