telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో “ఉప్పెన”?

Uppena

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయమవుతున్న చిత్రం “ఉప్పెన”. చేస్తూ బుచ్చిబాబు సన తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి నటించగా, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు సినీ ప్రేమికులను ఆకట్టుకోగా… ఈ సినిమాను స్వచ్ఛమైన ప్రేమ కథగా తీసుకొస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా ఓటిటీలో రిలీజ్ కాబోతుందని,. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. పైగా ఈ సినిమాకి సదరు ఓటిటి సంస్థ భారీ మొత్తం ఆఫర్ చేస్తోందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వైష్ణ‌వ్‌ తేజ్, క్రిష్ దర్శకత్వంలో మరో వినూత్నమైన సినిమా చేస్తున్నాడు.

Related posts