ఎప్పటికప్పుడు గూగుల్ తన వినియోగదారుల కోసం సరికొత్తగా ముస్తాబవుతుంది. ఇప్పటే పలువిదాలైన యాప్స్‌ను తన యూజర్స్ కోసం అందుబాటులోకి తెచ్చిన గూగుల్ తమ వినియోగదారుల భద్రత విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అనుసరిస్తూ ముందుకు వెళ్లుతుంది. ఇప్పటికే గూగుల్‌ల్లో ఉన్న కొన్ని యాప్స్ వాడటం వల్ల సెక్యూరీటీ లేదనే నిందను మూటగట్టుకున్న గూగుల్ అందుకుగాను వాటిపై దృష్టి సారించింది. ఈ మద్యకాలంలో హ్యకర్ల వల్ల వచ్చిన కొన్ని వైరస్‌లను కూడా యూజర్లకు తెలిపి ముందు జాగ్రత్తగా హెచ్చరించింది. ఇక గూగుల్ మొదట్లో కేవలం ఓ సెర్చ్ ఇంజిన్‌గానే తన కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఇప్పటికీ అది ఈ రంగంలో అగ్రగామిగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఫోన్ తీసుకుని ఏదైనా సమాచారం కావాలనుకుంటే ఇప్పటికి 89శాతం మంది ప్రజలు గూగుల్‌నే యూజ్ చేసుకుంటారు. నిత్యజీవితంలో భాగంగా మారిపోయిన గూగుల్ యాప్స్‌ను ఉపయోగించకుండా ఎంతమంది తమ మొబైల్ ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటారంటే చెప్పడం కష్టం.
తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు యూజర్లకు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 12 వేల హెచ్చరికలను గూగుల్ పంపింది. అందులో 500 మంది భారతీయులూ ఉన్నారట. ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకర్ల దాడికి గురయ్యే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించింది. వాట్సాప్ వీడియో కాలింగ్‌లోని లోపం ద్వారా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌సాయంతో పలు దేశాల ప్రభుత్వాలు మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల సమాచారం హ్యాక్ చేస్తున్నారన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. దాదాపు 50 దేశాలకు చెందిన ప్రభుత్వ మద్దతుదారులైన హ్యాకర్లు 270 మందిని టార్గెట్ చేసినట్లు గూగుల్ తెలిపింది. కనుక గూగుల్ వాడేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉందన్న మాట!