telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఉసిరికతో ఈ సమస్యలకు చెక్..

భారతీయ ఆధ్యాత్మిక చింతనతోపాటు వైద్యంలోనూ ఉసిరికకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. హిందూ ధర్మం ఉసిరిక చెట్టును పవిత్రంగా భావిస్తుంది. రోగాల బారి నుంచి కాపాడేందుకు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతో కీలకమైన విటమిన్‌ ‘సి’ ఉసిరికలో అత్యధికంగా ఉంది. నారింజ పండులో కంటే దాదాపు 30 రెట్లు విటమిన్‌ సి ఇందులో ఉందంటే ఆశ్చర్యం కలిగించకమానదు. విటమిన్‌ ‘సి’ లోపంతో వచ్చే చిగుళ్ల రక్తస్రావం, చిగుళ్లు రంగుమారడం వంటి వాటిని రోజూ ఉసిరిక ఆహారంలో తీసుకోవడం ద్వారా నివారించవచ్చు.
కంటి చూపు కోసం:
కంటి దోషాలను ఉసిరిక గణనీయంగా తగ్గిస్తుంది. ఇందులో ఉన్న విటమిన్‌ ‘సి’ రెటీనాపై ప్రభావం చూపి సమస్య తీవ్రతను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్‌ ‘ఏ’, ‘బి’ కాంప్లెక్స్‌ తోపాటు కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఫైబర్‌ కూడా ఇందులో తగినంతగా ఉంది.
పొట్టలో దోషాలకు:
జీర్ణ లోపాలను సరిచేసి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా శరీరం నుంచి అదనపు నీరు, లవణాలను తొలగించేలా సాయపడుతుంది. ఇందులో ఉండే పీచు ఆకలిని తగ్గించి, తినే ఆహారం మోతాదును కూడా క్రమేపీ క్రమబద్దం చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా సహజంగానే అధికబరువు తగ్గిపోతుంది. దీంతో మీరు చురుగ్గా తయారవుతారు.

Related posts