telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

లేత వయసులో .. మద్యం సేవిస్తే.. లేనిపోని రోగాలు వస్తాయట!

early taking alcohol causes diseases

మద్యం తాగేవారు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. అమెరికాలోని ఓ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని వింటే ఎక్కిన మత్తు కూడా దిగిపోతుంది. అవేంటంటే..

లేత వయసులో మందు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయట. ఒత్తిడి, ఆందోళన పెరిగి మద్యానికి బానిసలుగా తయారవుతారట. దీనివల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడడమేకాకుండా, నాడీ వ్యవస్థ దెబ్బతిని స్వీయ నియంత్రణ శక్తిని సైతం కొల్పోతారని తెలియజేస్తోంది.

వయస్సులో ఉన్నప్పుడు ఎక్కువ మద్యాన్ని సేవించిన, అరవై సంవత్సరాల వయస్సు ఉన్న వారిపై పరిశోధనలు నిర్వహించారు. వీరిలో మందు తాగే అలవాటు లేని వారికి రెండు వ్యాధులు సోకితే; ముందు తాగే అలవాటు ఉన్నవారికి మాత్రం మూడు, అంతకన్నా ఎక్కువ వ్యాధులు ఉన్నట్లు తేలింది.

కాబట్టి పరీక్షలు బాగా రాసామనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, లవ్ సక్సెస్ అయిందనో లేదా లవ్ ఫెయిల్ అయిందనో మందు తాగే యువకుల్లారా కాస్త ఆలోచించండి. జాగ్రత్త వహించండి అంటూనే.. అతిగా మద్యం తాగడం వల్ల 60ఏళ్లు వచ్చాకే, దాని దుష్ప్రభావాలు కనిపిస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Related posts