telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

గ్రేటర్ ఎన్నికల ప్రచారం పై ఈసీ స్పష్టత…

ప్రస్తుతం తెలంగాణ మొత్తం ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రచారం పీక్‌కు చేరుకుంది.. డిసెంబర్‌ 1వ తేదీన పోలింగ్‌ జరగనుండగా… అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.. రేపటితో ప్రచార పర్వానాకి కూడా తెరపడనుంది.. దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం… గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగించాల్సిందేనని స్పష్టం చేసింది ఈసీ.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఇక, ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటించని రాజకీపార్టీల నేతలు, అభ్యర్ధుల, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్‌.. ఈసీ నిబంధనలు పాటించనివారిపై జీహెచ్‌ఎంసీ యాక్ట్‌, 1955 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.. లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కాగా, గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు టాప్ లీడర్లను రంగంలోకి దించాయి… ఇవాళ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనగా.. మరోవైపు బీజేపీ నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్‌షో నిర్వహిస్తున్నారు. మరి చూడాలి ప్రజలు ఎవరికీ మద్దతు తెలుపుతారు అనేది. 

Related posts