telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కరోనాపై అసత్య ప్రచారం.. 25 మంది అరెస్ట్

corona

కరోనా వైరస్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయి. అసత్య ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫేక్‌న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ వెబ్‌సైట్ ‘ఫ్యాక్ట్‌చెక్.తెలంగాణ.జీవోవీ.ఇన్ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఈ వెబ్‌సైట్ గత వారం రోజుల్లో 20 తప్పుడు వార్తలను గుర్తించింది. ఇక, ఫేక్‌న్యూస్‌పై గత వారం రోజుల్లో 200 వరకు ఫిర్యాదులు అందినట్టు ఐటీశాఖ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ తెలిపారు. ప్రతి క్షణం 300 మందికిపైగా వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే, వైద్యులు, పోలీసులు, అధికారుల పేరిట తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Related posts